వన మహోత్సవానికి చికెన్ సెంటర్ అడ్డంకి
శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి కాచాపూర్ గ్రామంలో చికెన్ సెంటర్ అడ్డంకిగా మారింది. మంగళవారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సోమవారం ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారు. అయితే రహదారిని ఆనుకుని ఓ వ్యక్తి చికెన్ సెంటర్‌తో పాటు బెల్టు షాపు నిర్వహిస్తుండటంతో మొక్కలు నాటే పనులకు ఇబ్బంది ఏర్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన చికెన్ సెంటర్‌ను తొలగించాలని...