SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 11:43 am Posted by : SHENARTHI MEDIA

గని కార్మికులతో రక్షాబంధన్ వేడుకలు

శెనార్తి మీడియా, గోదావరిఖని:
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి 11వ ఇంక్లైన్ గనిలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

సింగరేణి కార్మికులు కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి, దేశ ఆర్థిక ప్రగతికి అందిస్తున్న సేవలు అభినందనీయమని సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రక్షాబంధన్ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ పర్వదినం ఆనందం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. కార్మికులతో ఆత్మీయంగా మమేకమై వేడుకలు నిర్వహించడంపై పలువురు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, పిట్ సెక్రటరీ వేల్పుల లక్ష్మణ్, ముల్గురి వీరయ్య, పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, కార్పొరేటర్ అభ్యర్థి అరిగేల శ్రవణ్, రాజు, నాయకులు సురేష్, శంకర్, కుమారస్వామి, హనుమంత్, మంజుల, రజిత, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.