గని కార్మికులతో రక్షాబంధన్ వేడుకలు

శెనార్తి మీడియా, గోదావరిఖని: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి 11వ ఇంక్లైన్ గనిలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులు కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి, దేశ ఆర్థిక ప్రగతికి అందిస్తున్న సేవలు అభినందనీయమని సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రక్షాబంధన్ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం,...