కొత్తగట్టులో ఉధృతంగా అండర్‌పాస్ సాధన పోరాటం
శెనార్తి మీడియా, శంకరపట్నం: జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నుంచి గ్రామస్థుల ప్రాణాలను కాపాడాలని, కొత్తగట్టు జంక్షన్ వద్ద తక్షణమే అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రధాన చౌరస్తా వద్ద రోజుకు 100 మందితో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అండర్‌పాస్ సాధన సమితి నాయకులు తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామం రెండుగా విడిపోయిందని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు, రైతులు, వృద్ధులు రహదారి దాటే...