ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా

శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామం రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి ఫ్లైఓవర్‌పై బుధవారం ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన బుక్య సునీత (37)కు తల, భుజానికి బలమైన గాయాలు కాగా, ఆమె భర్త బుక్య రాజ్‌కుమార్ (43) స్వల్పంగా గాయపడ్డారు. వరంగల్‌లో బంధువుల శుభకార్యానికి వెళ్లి సొంత ఆటోలో కరీంనగర్‌కు తిరిగి వస్తుండగా తాడికల్ ఫ్లైఓవర్ వద్ద ఆటో అదుపుతప్పినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మతి...