మక్త వద్ద రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం: పండగ వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నాపూర్‌కు చెందిన కూరపాటి అరవింద్, ముత్తారం గ్రామానికి చెందిన మంద వంశీకృష్ణ ద్విచక్ర వాహనంపై కేశవపట్నం వెళ్తుండగా.. మామిడాలపల్లికి చెందిన వ్యక్తి కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అరవింద్‌కు తీవ్ర గాయాలు కాగా, వంశీకృష్ణకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు,...