శెనార్తి మీడియా, శంకరపట్నం:
జనసేన పార్టీ అధినేత జన్మదిన వేడుకలను శంకరపట్నం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జనసేన అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కంటే రాకేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కార్యక్రమంలో బక్కి అనిత్ కుమార్, పంజాల యశ్వంత్, కూచన శ్రీనివాస్, హరీష్, శీను, శివప్రసాద్, శ్రీకాంత్, సురేష్, మొగిలి, సాయి, విష్ణువర్ధన్, అనిల్, మణికంఠ, తిరుపతి, అరవింద్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.