శెనార్తి మీడియా, శంకరపట్నం:
విద్యార్థుల అభ్యసనకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ సూచించారు. రాష్ట్ర సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను పాఠశాల విద్యార్థులకు అందజేశారు.
పాఠశాల సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు ఉమారాణి రూపొందించిన మెటీరియల్‌ను ప్రధానోపాధ్యాయురాలు నీరజ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాల్లోని అన్ని అంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా నిపుణుల సూచనలతో ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్లు నీరజ తెలిపారు.
ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అందించే స్టడీ మెటీరియల్, ఇతర సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచుకొని చదువులో ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు మెటీరియల్ అందించేందుకు కృషి చేసిన ఉమారాణిని ప్రధానోపాధ్యాయురాలు అభినందించారు.
పాఠశాలకు అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు నీరజకు ఉమారాణి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.