420 హామీలు అమలు చేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ  బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో అనితకు సోమవారం వినతిపత్రం అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగం పెంచాలని వారు కోరారు. ముఖ్యంగా ఆడబిడ్డల వివాహానికి నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీ అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ప్రతి పంటకు రైతు భరోసా, పంటలకు బోనస్‌, 24 గంటల నిరంతర విద్యుత్‌...