సీఐడీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్
శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ చిర్ర శ్రీనివాస్ సోమవారం జరిగిన సీఐడీ పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన సీఐడీ కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీఐడీ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.