మానవత్వం మంట కలిసిన వేళ..
పసికందు మృతదేహం లభ్యం శెనార్తి మీడియా, శంకరపట్నం: అప్పుడే లోకాన్ని చూసిన ఆ పసికందుకు.. బతికే అవకాశం కూడా దక్కలేదు. కన్నవారి ఆప్యాయతకు నోచుకోకుండానే మట్టిలో కలిసిపోయింది. శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం పాతవాడ మోరి పక్కన మంగళవారం రాత్రి గుంత తీసి పాతిపెట్టిన పసికందు మృతదేహం వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. సుమారు మూడు, నాలుగు రోజుల వయసున్న పసికందుగా, దాదాపు మూడు కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడే పుట్టిన ఆ చిన్నారిని ఎవరు అక్కడికి తీసుకొచ్చారు?...