- వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు
శెనార్తి మీడియా, రామడుగు :
పరిసరాల పరిశుభ్రత ఊరి ప్రజలందరి బాధ్యత అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో ‘ఏక్ దిన్ – ఏక్ గంటే – ఏక్ సాత్’ పారిశుధ్య శ్రమదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడిచెత్త పచ్చ రంగు డబ్బాలో, పొడిచెత్త నీలం రంగు డబ్బాలో వేసి జీపీ సిబ్బందికి అందించాలన్నారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం భద్రంగా ఉంటుందని, తద్వారా రోగాలు దూరంగా ఉంటాయన్నారు. ప్రజలు చెత్తను ఆరుబయట ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలన్నారు. మన ఇల్లు, వీధి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి విధి అని గుర్తుచేశారు. అనంతరం మహిళలు, యువకులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు సభ్యులు, కాలనీ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
కరెంట్ పోల్స్ ఏర్పాటు
వెలిచాల అనుబంధ గ్రామం కిష్టారావుపల్లి చౌట్ల నుండి అయ్యవారికుంట గుండు హనుమాన్ టెంపుల్ బతుకమ్మ ఘాటు వరకు 21 కరెంట్ స్తంభాలు, వాటికి వీధిదీపాలు ఏర్పాటు చేశారు. వీటిని ట్రాన్స్ కో ఏఈ కమలేష్ తో కలిసి సర్పంచ్ వీర్ల నర్సింగారావు ఆదివారం ప్రారంభించారు.