అండర్‌పాస్ కోసం జాతీయ రహదారిపై ధర్నా

నేడు ఆర్డీవో విచారణకు హామీ.. రాకుంటే మళ్లీ ఆందోళనకు గ్రామస్తుల హెచ్చరిక శెనార్తి మీడియా, శంకరపట్నం: కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తగట్టు జాతీయ రహదారిపై రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అండర్‌పాస్ నిర్మాణం కోసం గత కొన్ని రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి దాటే క్రమంలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల కారణంగా...