SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:16 am Posted by : SHENARTHI MEDIA

‘సిరిసిల్ల’కు తమిళనాడు చీరల ఆర్డర్​

శెనార్తిమీడియా, కరీంనగర్​ :

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా రాజన్న సిరిసిల్ల పవర్​ లూమ్ పరిశ్రమకు తమిళనాడు చీరల ఆర్డర్లు వచ్చాయి. కొన్నినెలలుగా ఆర్డర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, ఆసాములు, టెక్స్​ టైల్​ యజమానులకు ఈ ఆర్డర్లు కొంత ఊరటనిచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు చీరలను పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నాణ్యమైన చీరల తయారీకి సిరిసిల్ల పవర్​ లూమ్ పరిశ్రమకు ఆర్డర్లు రావడంతో కార్మికులకు చేతినిండా పని దొరకనుంది. తమిళనాడు ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడంతో సిరిసిల్లలో ఆసాములు, కార్మికులు, యజమానులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పరిశ్రమకు కొంత స్థిరత్వం లభించే అవకాశం ఉంది. చీరల ఉత్పత్తి పెరగడంతో పవర్‌లూమ్‌ ల నిర్వహణ, అనుబంధ రంగాల్లోనూ ఉపాధి పెరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కార్మికులు, ఆసాములు కోరుతున్నారు.