‘సిరిసిల్ల’కు తమిళనాడు చీరల ఆర్డర్
శెనార్తిమీడియా, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు తమిళనాడు చీరల ఆర్డర్లు వచ్చాయి. కొన్నినెలలుగా ఆర్డర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, ఆసాములు, టెక్స్ టైల్ యజమానులకు ఈ ఆర్డర్లు కొంత ఊరటనిచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు చీరలను పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నాణ్యమైన చీరల తయారీకి సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు ఆర్డర్లు రావడంతో కార్మికులకు చేతినిండా పని దొరకనుంది. తమిళనాడు ప్రభుత్వం వస్త్ర...