SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 10:10 am Posted by : SHENARTHI MEDIA

శ్రీరాములపల్లి సర్పంచ్ కు పరామర్శ

శెనార్తిమీడియా, రామడుగు :
రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ ఒంటెల సుగుణమ్మను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం పరామర్శించారు. సుగుణమ్మ ప్రమాదవశాత్తు కింద పడడంతో కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఊకంటి చంద్రారెడ్డి, జూపాక మునీందర్ తదితరులు ఉన్నారు.