ఎండిపోతున్న పంటలను కాపాడాలి

24 గంటల కరెంట్ ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌డిమాండ్‌ గంగాధర చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ఆధ్వర్యంలో ధర్నా శెనార్తిమీడియా, గంగాధర : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌సరఫరా చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్‌చేస్తూ బీఆర్‌ఎస్‌మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర చౌరస్తాలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరి పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతులు...