SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:32 pm Posted by : SHENARTHI MEDIA

సైబర్‌ నేరాలపై ప్రయాణికులకు అవగాహన

శెనార్తి మీడియా, శంకరపట్నం:

కేశవపట్నం బస్టాండ్‌లో గురువారం పోలీసులు ప్రయాణికులకు సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్‌, పాస్‌వర్డ్‌లను ఇతరులకు వెల్లడించరాదన్నారు. ఆన్‌లైన్‌ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.