SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 10:16 am Posted by : SHENARTHI MEDIA

బాధిత కుటుంబానికి పరామర్శ

శెనార్తిమీడియా, గంగాధర :

గంగాధర మండలం గట్టుభుత్కూర్ గ్రామానికి చెందిన బీఆర్​ఎస్​ కార్యకర్త బోయిని మునీందర్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ గురువారం పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మునీందర్​ బుధవారం మృతిచెందాడు. కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, బీఆర్​ఎస్​ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు మల్లేశం, వార్డు మెంబెర్స్, కార్యకర్తలు ఉన్నారు.