SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 9:29 am Posted by : SHENARTHI MEDIA

ఎస్జీఎఫ్​  వెయిట్‌ లిఫ్టింగ్ పోటీలకు డ్రీమ్ విద్యార్థులు

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

ఎస్జీఎఫ్​ అండర్​–19 వెయిట్​ లిఫ్టింగ్​ పోటీల్లో కొత్తపల్లి మండలం రేకుర్తి డ్రీమ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు  డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన శిక్షణ, సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు ఈ విజయమే నిదర్శనమని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.  క్రీడా ఇన్‌చార్జి శ్రీకాంత్​ పాల్గొన్నారు.