SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:41 pm Posted by : SHENARTHI MEDIA

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

శెనార్తిమీడియా, రామడుగు :

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లికి చెందిన 45 రోజుల చిన్నారి కరీంగనర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​ రావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పెగడపల్లి మండలం ఐతుపల్లికి చెందిన బొమ్మగోని కిషన్ తన కుమార్తెకు జ్వరం రావడంతో తన భార్య కవితను తీసుకుని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్ కు వచ్చారు. చికిత్స చేయించుకుని బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గోపాల్​ రావుపేట వద్ద కవిత చున్నీ బైక్ చక్రంలో చుట్టుకుని తల్లీకూతుళ్లు కిందపడ్డారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలపై మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.