SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:51 pm Posted by : SHENARTHI MEDIA

‘సెయింట్ జార్జ్‌-’లో బతుకమ్మ వేడుకలు

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్​ లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, టీచర్స్​ రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. స్కూల్​ చైర్మన్ ఫాతిమారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవం, ఐక్యతా భావం, ప్రకృతి పట్ల ప్రేమ పెంపొందుతాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.