SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 6:52 pm Posted by : SHENARTHI MEDIA

విజన్ హైస్కూల్ లో  వైభవంగా బతుకమ్మ సంబరాలు

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

కొత్తపల్లి మండలం రేకుర్తి విజన్ హైస్కూల్ లో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్– మమత దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు వివిధ రకాల పూలను తీసుకొచ్చి రంగురంగుల బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. స్కూల్​ డైరెక్టర్ సందవేణి వెంకట్, ఇంచార్జి ప్రతిభ భారతి, టీచర్స్​ పాల్గొన్నారు.