SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:21 pm Posted by : SHENARTHI MEDIA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక ‘బతుకమ్మ’

శెనార్తిమీడియా, గంగాధర :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని సురభి కాన్వెంట్​ హైస్కూల్​ కరస్పాండంట్ చిప్ప వీరేశం, నరేంద్ర స్కూల్​ కరస్పాండంట్ గంగాధర రాజేశం అన్నారు. దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో ముందస్తు వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటలతో ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. కార్యక్రమంలో ఆయా స్కూళ్ల డైరెక్టర్స్​ చిప్ప వీరనర్సయ్య, , గుజ్జుల గోపాల్ రెడ్డి, టీచర్స్​ పాల్గొన్నారు.