పీఎం ఈ-విద్య ఛానల్ కంటెంట్ కు ముగ్గురు ఉపాధ్యాయుల ఎంపిక
శెనార్తిమీడియా, కరీంనగర్ : ప్రధానమంత్రి ఈ-విద్య డీటీహెచ్ ఛానళ్ల కోసం విద్యా సంబంధిత కంటెంట్ ను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ టీ-హబ్ లో టీశాట్ టీవీ ఛానల్ సహకారంతో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌సీఈఆర్టీ, సీఐఈటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికై శిక్షణలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం జడ్పీహెచ్‌ఎస్ టీచర్ వినయాధర్ రాజు, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జడ్పీహెచ్‌ఎస్ కు చెందిన ఎండీ.షరీఫ్ అహ్మద్, చిగురుమామిడి మోడల్ స్కూల్ కు...