కేశవపట్నం బస్టాండ్ దుస్థితి..
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు కనీస సౌకర్యాలు కరువు.. ప్లాట్‌ఫారాలపై ఆగని బస్సులు శెనార్తి మీడియా, శంకరపట్నం: కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కేశవపట్నం బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ నిర్వహణపై ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచినీరు, సరైన లైటింగ్, బస్సుల రాకపోకల వివరాలు తెలిపే ట్రాఫిక్ గైడ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో ఫ్రిజ్ ఉన్నప్పటికీ తాగునీరు అందుబాటులో లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. చీకట్లో...