పూల పండుగకు వెలుగు కరువు

తొలిరోజు చీకట్లోనే బతుకమ్మ వేడుకలు కరీంపేట తొమ్మిదో వార్డులో మహిళల అసహనం శెనార్తి మీడియా, శంకరపట్నం: పూల పండుగకు వెలుగు కరువైంది. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తొలి రోజు నిశీధిలోనే ఆడుకోవాల్సి వచ్చింది. మండలంలోని కరీంపేట గ్రామం తొమ్మిదో వార్డులో బతుకమ్మ వేడుకలకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. తొలిరోజు వేడుకల్లో భాగంగా కాలనీ మహిళలు బస్టాండ్ వద్ద బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో వీధి దీపాల వెలుతురులోనే...