రామగుండంలో చేతులెత్తేసిన అధికారులు

సొంత నిధులతో రోడ్ల గుంతల పూడ్చివేయించిన కార్పొరేటర్ రోడ్ల మరమ్మతు కోసం ఆరు నెలలుగా అధికారులకు అర్జీలు స్పందించని మున్సిపల్ యంత్రాంగం శెనార్తి మీడియా, రామగుండం: రామగుండం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్ల గుంతలను పూడ్చేందుకు నగరంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా మహేష్ స్వయంగా ముందుకొచ్చారు. ఆరు నెలలుగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సుమారు రూ.లక్ష సొంత నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు. డివిజన్‌లో రోడ్లు గుంతలమయంగా మారి స్థానిక ప్రజలు అవస్థలు...