SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:51 pm Posted by : SHENARTHI MEDIA

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి భద్రత

వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు

శెనార్తిమీడియా, కరీంనగర్​ :

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి భద్రత అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా వెలిచాల అనుబంధ గ్రామం కిష్టారావుపల్లిలో అయ్యవారికుంట ఆలయం, బతుకమ్మ ఘాట్ వద్ద ఆదివారం 15వ శ్రమదానం నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యవారికుంట, భక్తాంజనేయ స్వామి దేవాలయం, బతుకమ్మ ఘాట్ పరిసరాలలో శ్రమదాన చేపట్టారు. ఆలయ పరిసరాలు, ఘాట్ మెట్లు, కుంట గట్టు వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు. ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పారలు, చీపుర్లు పట్టి శ్రమదానం చేశారు.  అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గ్రామమే తమ లక్ష్యమని, ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ శ్రమదాన కార్యక్రమం 15వ వారానికి చేరుకోవడం సంతోషంగా ఉంది. భక్తులు అధికంగా వచ్చే అయ్యవారికుంట ఆలయాన్ని, బతుకమ్మ ఘాట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత, గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.