పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి భద్రత

వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు శెనార్తిమీడియా, కరీంనగర్​ : పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి భద్రత అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్​ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా వెలిచాల అనుబంధ గ్రామం కిష్టారావుపల్లిలో అయ్యవారికుంట ఆలయం, బతుకమ్మ ఘాట్ వద్ద ఆదివారం 15వ శ్రమదానం నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యవారికుంట, భక్తాంజనేయ స్వామి దేవాలయం, బతుకమ్మ ఘాట్ పరిసరాలలో శ్రమదాన చేపట్టారు. ఆలయ పరిసరాలు, ఘాట్ మెట్లు, కుంట గట్టు వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను...