పరిశుభ్రతే మన లక్ష్యం
వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు శెనార్తిమీడియా, రామడుగు : పరిశుభ్రతే మన లక్ష్యమని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా రామడుగు మండలం వెలిచాల అనుబంధం కిష్టారావుపల్లిలో 16వ శ్రమదానం- అయ్యవారికుంట ఆలయం, బతుకమ్మ ఘాట్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యవారికుంట భక్తాంజనేయ స్వామి దేవాలయం, బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పరిసరాలు, ఘాట్ మెట్లు, కుంట గట్టు వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించి...