రాష్ట్రస్థాయి బాస్కెట్‌ బాల్ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ‘సెయింట్​ జార్జ్’

శెనార్తిమీడియా, కరీంనగర్​ : రాష్ట్రస్థాయి బాస్కెట్‌ బాల్ ఛాంపియన్‌  షిప్‌ పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని సెయింట్​ జార్జ్​ స్కూల్​విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్​ చైర్మన్​ ఫాతిమారెడ్డి తెలిపారు. కరీంనగర్​ పట్టణంలోని ఓ స్కూల్​లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్​ విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. తమ స్కూల్​కు చెందిన ఇద్దరు విద్యార్థులు వేర్వేరు విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఎన్.సుహాక్షి అండర్-14 విభాగంలో ఎంపికై  ఖమ్మంలో నిర్వహించనున్న...