అలరించిన బతుకమ్మ వేడుకలు
శెనార్తిమీడియా, కరీంనగర్: కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్, ప్యారడైజ్ విద్యా సంస్థల్లో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అలరించాయి. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటారు. విద్యాసంస్థల చైర్మన్ డా.పి.ఫాతిమారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,...