ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్
111 మందిలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, కరీంనగర్ : అనారోగ్యం, ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ఆపదలో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు రూ.31,08,700ల విలువైన ఆర్థికసాయం చెక్కులను గంగాధర ప్రజా కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల కంటే...