అనాథ పిల్లలకు ఆప్యాయతల ఆలయం

ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా సుంకె రవిశంకర్​ శెనార్తిమీడియా, గంగాధర : అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనుకునే ఈ రోజుల్లో అధికారంలో లేకున్నా తనను నమ్ముకున్న వారిని అక్కున చేర్చుకోవడమే తన బాధ్యతగా భావిస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పదవి లేకున్నా తనలోని మానవత్వం మారదని మరోసారి నిరూపించుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆయన అందిస్తున్న ఆప్యాయత, భరోసా, సహాయం చూస్తే రక్తసంబంధం లేకున్నా మనసుతో ఏర్పడే బంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఏటా బతుకమ్మ పండుగ...