SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 3:41 pm Posted by : SHENARTHI MEDIA

రంగారావుపల్లి జీపీ సిబ్బందికి దసరా కానుక

శెనార్తిమీడియా, గంగాధర :

గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి పాలకవర్గ సభ్యులు గురువారం దసరా కానుకలు అందజేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం డ్రెస్​లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి శంకరయ్య, ఉప సర్పంచ్​ బహదూర్​ రెడ్డి, కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు .