SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:23 am Posted by : SHENARTHI MEDIA

గొర్రెల పెంపకందారుల సంఘానికి ఈడీని నియమించాలి

శెనార్తి మీడియా, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను నియమించాలని కోరుతూ యూనియన్‌ చైర్మన్‌ భాషవేని మల్లేశం యాదవ్‌, కాల్వ సురేష్‌ యాదవ్‌, ముక్కెర సదానందం యాదవ్‌ హైదరాబాద్‌లో తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఎండీ సుబ్బారాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భాషవేని మల్లేశం యాదవ్‌ మాట్లాడుతూ.. అనేక సమస్యలతో సహకార సంఘం కొనసాగుతోందని తెలిపారు. పాలకవర్గ ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తున్నా కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారిని  నియమించలేదని పేర్కొన్నారు. సంఘం కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వెంటనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను నియమించాలని కోరినట్లు చెప్పారు.
రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ కే. సరిత తిరుపతయ్య, లైవ్‌స్టాక్‌ మిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ సహకారంతో రెండు మూడు రోజుల్లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నియామకం చేపడతామని హామీ ఇచ్చినట్లు మల్లేశం యాదవ్‌ వెల్లడించారు. సహకార సంఘం అభివృద్ధికి చైర్మన్లమంతా సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.