గొర్రెల పెంపకందారుల సంఘానికి ఈడీని నియమించాలి

శెనార్తి మీడియా, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను నియమించాలని కోరుతూ యూనియన్‌ చైర్మన్‌ భాషవేని మల్లేశం యాదవ్‌, కాల్వ సురేష్‌ యాదవ్‌, ముక్కెర సదానందం యాదవ్‌ హైదరాబాద్‌లో తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఎండీ సుబ్బారాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాషవేని మల్లేశం యాదవ్‌ మాట్లాడుతూ.. అనేక సమస్యలతో సహకార సంఘం కొనసాగుతోందని తెలిపారు. పాలకవర్గ ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తున్నా కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారిని  నియమించలేదని పేర్కొన్నారు. సంఘం కార్యకలాపాలు సజావుగా...