‘దుబాయ్’లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం : గోవర్ధన్ రెడ్డి శెనార్తిమీడియా, కరీంనగర్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని విల్లా నోవా కమ్యూనిటీలో తెలంగాణ ప్రవాసుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో...