SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 9:17 pm Posted by : SHENARTHI MEDIA

బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్

శెనార్తిమీడియా, రామడుగు :
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రామడుగు మండలం గుండి సర్పంచ్ గుమ్మడి మల్లేశం ఆధ్వర్యంలో జీపీ నిధుల నుండి నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ ను మండల స్పెషల్ ఆఫీసర్ బండి రాజేశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో పండుగల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, బతుకమ్మ ఘాట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సర్పంచ్, పాలకవర్గం బతుకమ్మ ఘాటు ను ఏర్పాటు చేయడంపై అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంగి రాజేశ్వరి, తహసీల్దార్ దాసరి రాజు, ఎంపీఓ శ్రావణ్ కుమార్, ఏపీఓ రాధ, వార్డు మెంబెర్స్ రాజు, పంజాల శ్రావణ్ గౌడ్, సోయల్, గోదరి తిరుపతి, మడ్డి శ్వేత మురళీగౌడ్, గాండ్ల ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి ఎం.జనార్ధన్, మాజీ ఉప సర్పంచులు మేడి శ్రీనివాస్ గౌడ్, బొమ్మరవేణి లచ్చయ్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.