బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్
శెనార్తిమీడియా, రామడుగు : బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రామడుగు మండలం గుండి సర్పంచ్ గుమ్మడి మల్లేశం ఆధ్వర్యంలో జీపీ నిధుల నుండి నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ ను మండల స్పెషల్ ఆఫీసర్ బండి రాజేశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో పండుగల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, బతుకమ్మ ఘాట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు...