SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:28 pm Posted by : SHENARTHI MEDIA

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో ‘తాడిజెర్రి’కి గుర్తింపు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో ‘తాడిజెర్రి’కి గుర్తింపు

శెనార్తిమీడియా, గంగాధర :

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో గంగాధర మండలం తాడిజెర్రి గ్రామానికి గుర్తింపు లభించింది. ‘బొడ్డెమ్మ ఒక పల్లె జ్ఞాపకం’ వీడియో సాంగ్‌ తృతీయ బహుమతి సాధించింది. తెలంగాణ పల్లె సంస్కృతి, బతుకమ్మ పండుగ వైభవం, పల్లె జీవనశైలి, మధురమైన జ్ఞాపకాలను ప్రతిబింబించేలా పాట దర్శకుడు రామిడి సతీష్, సహాయ దర్శకులు కొండపర్తి సతీష్, వేముల జయప్రకాష్​ రూపొందించిన ఈ వీడియో సాంగ్ ను తెరకెక్కించారు. ఈ పాటకు అవార్డు లభించడం తాడిజెర్రి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. దర్శకుడు బహుమతితో రూ.20 వేల నగదు పురస్కారం  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రముఖ దర్శకుడు దిల్ రాజు, కాసాల గద్దర్ నర్సన్న, విమలక్క, గుమ్మడి వెన్నెల, దర్శకుడు వశిష్ఠ, కొండ రాజు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వీడియో సాంగ్‌లో వరాల సత్తవ్వ, రామిడి భాగ్యలక్ష్మి, వంగల రజిత, వరాల పుష్ప, వంగాల రమ్య నటించారు.