కరీంపేటలో వ్యవసాయ మోటార్ల చోరీ

శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో వ్యవసాయ మోటార్ల చోరీ ఘటన కలకలం రేపింది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ముగ్గురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. శుక్రవారం రాత్రి ములుగురి స్వామి, బొజ్జ అశోక్, వనపర్తి రాజేశం వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసుకున్న మోటార్లను దుండగులు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఎండల తీవ్రతతో పంటలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న తరుణంలో మోటార్లు...