శివాలయంలో చండీయాగం

శెనార్తిమీడియా, రామడుగు : రామడుగు మండలం వెలిచాల శివాలయంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చండీయాగం నిర్వహించారు. యాగంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు, మాజీ సర్పంచ్​ వీర్ల సరోజన, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్​ రావు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, దుర్గామాత మాలధారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని స్మరించుకున్నారు.