SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 1:38 pm Posted by : SHENARTHI MEDIA

ఎల్‌నినో ప్రభావాలను తట్టుకునే పంటలు సాగు చేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే అపరాలు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం ద్వారా ప్రారంభించిన ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కేశవపట్నం రైతు వేదికలో మానకొండూర్ ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వినియోగం, పంటల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు వివరించారు.

అనంతరం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో శంకరపట్నం ఏఓ వెంకటేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి, ఏఈఓలు స్రవంతి, కీర్తన, సునంద, ఆరతి, అర్చనతో పాటు రైతులు పాల్గొన్నారు.