ఎల్‌నినో ప్రభావాలను తట్టుకునే పంటలు సాగు చేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే అపరాలు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం ద్వారా ప్రారంభించిన ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కేశవపట్నం రైతు వేదికలో మానకొండూర్ ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో తొలి అవగాహన కార్యక్రమం...