శెనార్తిమీడియా, గంగాధర:
గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దాసరి శంకరయ్య తెలిపారు. శ్రీ వరుణ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట నిర్వహిస్తారని పేర్కొన్నారు. మనిషి శరీరంలో కళ్లు అత్యంత విలువైన అవయవాలని, కంటిచూపును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.