SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 3:03 pm Posted by : SHENARTHI MEDIA

కళాభారతిలో అన్నమయ్య గానామృతం

శెనార్తిమీడియా, కరీంనగర్ :
కరీంనగర్‌ కళాభారతి వేదికగా శ్రీ మేధా సంగీత శిక్షణాలయంలో కిట్లా ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నమయ్య గానామృతం సంగీత ప్రియులను అలరించింది. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి రవీందర్‌కు చెందిన రాగవర్ధిని సంగీత బృందం తన అద్భుతమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం 15 సంగీత బృందాలు పాల్గొన్న ఈ కార్యక్రమం వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలతో మారుమ్రోగింది. అన్నమయ్య కీర్తనల ఆలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, సంగీత ప్రియులకు భక్తి భావాన్ని పంచింది.