జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో కరీంనగర్‌ జట్లకు ప్రథమ స్థానం

శెనార్తి మీడియా, శంకరపట్నం: కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌–14 బాలబాలికల వాలీబాల్‌ పోటీలు, సెలక్షన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో కరీంనగర్‌ జట్టు ప్రథమ స్థానం, సిరిసిల్ల జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలోనూ కరీంనగర్‌ జట్టు మొదటి స్థానం, సిరిసిల్ల జట్టు రెండో స్థానం దక్కించుకున్నాయి. కరీంనగర్‌ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్‌ ఆధ్వర్యంలో...