విద్యాప్రేరణ గీతం విడుదల

శెనార్తి మీడియా, శంకరపట్నం: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘చదువుకో చదువుకో చదువుకోరా తమ్ముడా.. చదువులోని విజయాన్ని తెలుసుకోరా చెల్లెలా’ అనే పాటను కేశవపట్నం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్ రెడ్డి విడుదల చేశారు. ఈ పాటను వెన్నెల క్రియేషన్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గీతానికి పూదరి అజయ్ కుమార్ సాహిత్యం అందించగా, రామంచ సుమన్, సంధ్య ఆలపించారు. హెచ్‌ఎన్‌కే రికార్డింగ్‌కు చెందిన బిక్షపతి సంగీత బాధ్యతలు నిర్వహించగా, సంతోష్ ఎడిటింగ్ చేశారు. ముసుకు హరీష్...